అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే, ఆ దేశంపై భారీ దాడి జరుగుతుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, అమెరికాకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ఇరాన్, చైనా మరియు రష్యా దేశాలు కలిసి నౌకాదళ విన్యాసాలు (Joint Naval Exercises) చేపట్టనున్నాయి.
అణు ఒప్పందం వివాదం: ఇరాన్ వద్ద ఉన్న అణు సాంకేతికతను విద్యుత్ తయారీకి వాడుతోంది. అయితే అమెరికా వంటి దేశాల నుండి ముప్పు పొంచి ఉంటే, తన రక్షణ కోసం ఈ సాంకేతికతను ఆయుధంగా మార్చుకోవాలని ఇరాన్ యోచిస్తోంది. ఇది అమెరికాకు నచ్చడం లేదు. ఒప్పందంపై సంతకం చేస్తే ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని కోల్పోతుంది, అందుకే ఇరాన్ వెనకడుగు వేస్తోంది. దీనితో అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌక యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్‌ను ఇరాన్ దిశగా పంపింది.
8వ ఏడాది నౌకాదళ విన్యాసాలు: అమెరికా హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఇరాన్, చైనా మరియు రష్యాలు తమ సంయుక్త విన్యాసాలను ప్రారంభించనున్నాయి. గత 7 ఏళ్లుగా జరుగుతున్న ఈ విన్యాసాలు ఇప్పుడు 8వ ఏడాదికి చేరుకున్నాయి. హిందూ మహాసముద్రం మరియు ఒమన్ సముద్ర తీరాల్లో ఈ విన్యాసాలు జరుగుతాయి. ప్రపంచ కచ్చా నూనె సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధిని తమ నియంత్రణలో ఉంచుకోవడం ఈ దేశాల వ్యూహం.
పాల్గొంటున్న యుద్ధ నౌకలు:
- చైనా: అత్యంత ఆధునికమైన ‘తంగ్‌షాన్’ (Tangshan) డిస్ట్రాయర్ నౌకను పంపుతోంది. దీనిని చైనా వెర్షన్ ‘ఏజిస్’ అని పిలుస్తారు. ఇది శత్రు విమానాలను, నౌకలను కూల్చివేసే క్షిపణులను కలిగి ఉంది.
- ఇరాన్: తన అతిపెద్ద నౌక ‘ఐరిస్ మక్రాన్’ (IRIS Makran)తో పాల్గొంటోంది. ఒక ఆయిల్ ట్యాంకర్‌ను యుద్ధ నౌకగా మార్చిన ఈ నౌకపై అనేక హెలికాప్టర్లు ల్యాండ్ అవ్వగలవు. ఇది సముద్రంలో ఇతర నౌకలకు సహాయక కేంద్రంగా పనిచేస్తుంది.
- రష్యా: ‘స్టోయికీ’ (Stoykiy) అనే కొర్వెట్టి నౌకను పంపుతోంది. ఇది పరిమాణంలో చిన్నదైనప్పటికీ, జలాంతర్గాములను గుర్తించి ధ్వంసం చేయడంలో సిద్ధహస్తురాలు.
