భోపాల్ నుంచి జైపూర్ వెళ్తున్న రైలులోని స్లీపర్ కోచ్‌లో, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించిన ఓ మహిళ అర్ధరాత్రి వేళ ప్రయాణిస్తోంది.
అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో, ఆ మహిళ బ్యాగ్‌లో ఉన్న రూ. 10,000 నగదు మరియు ఖరీదైన మొబైల్ ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. తీవ్ర ఆందోళనకు గురైన ఆ ప్రయాణికురాలు వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అయితే, అవతలి వైపు నుంచి మాట్లాడిన సిబ్బంది కేవలం “ఓకే సార్… ఓకే సార్…” అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి కాల్ కట్ చేసినట్లు సమాచారం.
పదేపదే కాల్ చేసి నిలదీసిన తర్వాత మాత్రమే ఓ పోలీస్ అధికారి వచ్చి ఫిర్యాదు నమోదు చేసుకుని వెళ్లారు. కానీ, చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను కనిపెట్టేందుకు ఎలాంటి చొరవ చూపలేదు. అటు రైల్వే సిబ్బందిని వేడుకున్నా ఫలితం లేకపోవడంతో తోటి ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లో రైళ్లలో ప్రయాణించే వారి భద్రత పట్ల రైల్వే యంత్రాంగం ప్రదర్శిస్తున్న ఈ నిర్లక్ష్య వైఖరి నెట్టింట తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీసింది.

Leave a Reply