బాగ్పత్/ఉరయ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వివాహేతర సంబంధాలు చిచ్చు రేపుతున్నాయి. తాజాగా బాగ్పత్ జిల్లాలో ఒక వివాహిత తన ప్రియుడితో కలిసి హోటల్ గదిలో ఏకాంతంగా గడుపుతుండగా, అత్తగారి తరపు బంధువులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఢిల్లీ-సహరాన్పూర్ హైవేపై జరిగిన ఈ హైడ్రామా వివరాలు ఇలా ఉన్నాయి..
గమనించిన అత్తగారి కుటుంబం.. హోటల్ ముట్టడి!
కాంధ్లా ప్రాంతానికి చెందిన సదరు మహిళకు, తన గ్రామానికే చెందిన ఒక యువకుడితో గత కొంతకాలంగా అక్రమ సంబంధం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే ఆమె అత్తగారి ఇంట్లో పలుమార్లు గొడవలు జరిగాయి. బుధవారం మధ్యాహ్నం ఆ మహిళ తన ప్రియుడితో కలిసి రమాలాలోని ఒక ఓయో (OYO) హోటల్‌కు చేరుకుంది. అయితే ఆమెపై నిఘా ఉంచిన అత్తగారి కుటుంబ సభ్యులు, వెంటనే పోలీసులకు సమాచారం అందించి హోటల్‌కు చేరుకున్నారు.
పోలీసుల సమక్షంలో డోర్ ఓపెన్.. ఆపై దేహశుద్ధి!
పోలీసులు వచ్చి గది తలుపులు తీయించగా, మహిళ తన ప్రియుడితో కలిసి అభ్యంతరకర స్థితిలో కనిపించింది. ఇది చూసి ఆగ్రహంతో ఊగిపోయిన అత్తగారి బంధువులు వారిద్దరిపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ గొడవ వల్ల హైవేపై సుమారు అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయి, జనం భారీగా గుమిగూడారు.
రాజకీయ లింకులు? విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సదరు యువకుడు ఐలం ప్రాంతానికి చెందినవాడని, ఒక రాజకీయ పార్టీలో కీలక పదవిలో ఉన్నాడని తెలుస్తోంది. కాగా, పోలీసులు ఎటువంటి విచారణ జరపకుండానే వారిని స్టేషన్ నుండి వదిలేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
