ర్యాపిడో (Rapido) బైక్ ట్యాక్సీ సేవలను ఉపయోగించుకున్న ఒక మహిళా ప్రయాణికురాలు, రైడ్ ముగిసిన తర్వాత ₹80 ఛార్జీకి గాను ₹100 నోటు ఇచ్చింది.
అయితే, డ్రైవర్ వద్ద తిరిగి ఇవ్వడానికి ₹20 చిల్లర లేదు.
మిగిలిన మొత్తాన్ని ఆన్లైన్ (యూపీఐ) ద్వారా పంపాలని ఆ మహిళ కోరగా, దానికి కూడా నిరాకరించిన డ్రైవర్.. తన బ్యాగ్‌లో ఉన్న ₹10 డిటర్జెంట్ సర్ఫ్ ప్యాకెట్, ₹10 జెల్లీ మరియు ₹2 కాఫీ పౌడర్ ప్యాకెట్‌ను ఆమె చేతిలో పెట్టి.. “ఇలాగైతే ₹20కి సరిపోయింది, వచ్చేసారి వచ్చేటప్పుడు చిల్లర తెచ్చుకోండి” అని చెప్పాడు.
తనకు ఎలాంటి వస్తువులు అవసరం లేదని, మిగిలిన నగదునే తిరిగి ఇవ్వాలని ఆ మహిళ పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. డ్రైవర్ వద్ద చిల్లర లేనప్పుడు కస్టమర్ ఇష్టంతో సంబంధం లేకుండా వస్తువులను అంటగట్టి సరిచేయడం న్యాయమేనా అనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Leave a Reply