₹3,000 నుండి ₹15 కోట్ల వరకు.. పౌల్ట్రీ రంగంలో ప్రపంచాన్ని ఆకర్షించిన భారతీయ ‘కింగ్’: రైతు ‘లండన్’ కల నిజమైంది!!!

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన రవీంద్ర మాణిక్రావ్ మెడ్కర్ అనే రైతు విజయగాథ, పట్టుదలకు ఒక నిలువెత్తు నిదర్శనం.

1984లో తన ఇంటి మిద్దెపై కేవలం 100 కోళ్లతో, తండ్రి ఇచ్చిన ₹3,000 పెట్టుబడితో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నేడు ఆయన 1.8 లక్షల కోళ్లు, 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ ఫామ్ ద్వారా ఏడాదికి ₹15 కోట్ల ఆదాయాన్ని గడించే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు.

మధ్యలో ‘బర్డ్ ఫ్లూ’ వంటి విపత్తుల వల్ల వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ఆయన ఏమాత్రం కుంగిపోకుండా మళ్లీ బ్యాంకు రుణం పొంది, కఠిన శ్రమతో తన వ్యాపారాన్ని పూర్వ వైభవం కంటే మిన్నగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం భారత్‌లోనే కాకుండా విదేశీ వ్యవసాయ విద్యార్థులకు కూడా ఒక గొప్ప మార్గదర్శిగా నిలుస్తున్న రవీంద్ర మెడ్కర్ సాధించిన విజయం అంతర్జాతీయ సరిహద్దులను దాటింది.

ఆయన అసాధారణ ఎదుగుదలను గుర్తిస్తూ, ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆయనను ప్రసంగించడానికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ఒక సామాన్య గ్రామ రైతు తన అసాధారణ శ్రమతో లండన్ వరకు వెళ్లి అంతర్జాతీయ వేదికపై ప్రసంగించబోతుండటం యావత్ భారతీయ రైతులకు గర్వకారణం.


Posted

in

by

Tags: