ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ మరియు కావ్య మారన్ వివాహానికి సంబంధించిన ఒక కొత్త, ఆసక్తికరమైన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
వీరిద్దరి వివాహం గ్రీస్ దేశంలో అత్యంత వైభవంగా జరిగిన నేపథ్యంలో, ఆ వేడుకకు సంబంధించిన పలు వివరాలు వరుసగా బయటకు వచ్చి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక నెటిజన్.. ‘అనిరుధ్ – కావ్య మారన్ ఆత్మగౌరవ వివాహం (స్వయంమర్యాద పద్ధతిలో పెళ్లి) చేసుకున్నారా?’ అని ప్రశ్నించారు.
ఆ ప్రశ్నకు మాజీ మంత్రి టీఆర్బీ రాజా ఏమాత్రం తడుముకోకుండా ‘అవును’ (Yes) అని సూటిగా ఒక్క మాటలో సమాధానమిస్తూ రిప్లై ఇచ్చారు.
మాజీ మంత్రి ఇచ్చిన ఈ సింపుల్ అండ్ డైరెక్ట్ సమాధానం ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా, వీరి వివాహంపై జరుగుతున్న చర్చలను మరింత వేడెక్కించింది.

Leave a Reply