అబుదాబిలో నిర్వహించిన అంతర్జాతీయ వేట మరియు గుర్రపు స్వారీ ప్రదర్శనలో ‘అల్ట్రా వైట్ ప్యూర్ జిర్ కర్మూషా’ అనే అరుదైన స్వచ్ఛమైన తెల్లని వల్గు పక్షి ఏకంగా 15 లక్షల యూఏఈ దిర్హామ్‌లకు వేలం వెళ్లింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.3.85 కోట్లు.
అమెరికాకు చెందిన మార్క్ మొగ్లిచ్ ఫామ్ ఈ అరుదైన పక్షిని వేలానికి తీసుకొచ్చింది. సుమారు 1 కిలో బరువు, 16.5 అంగుళాల పొడవు ఉన్న ఈ తెల్లని వల్గు పక్షి వేలంలో భారీ ధర పలికింది.
ఇదిలా ఉండగా, షైఖా అల్ మన్సూరి అనే బాలిక తన మామతో కలిసి ఈ వేలం ప్రదర్శనకు హాజరైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు పక్షుల పెంపకంపై ఆసక్తి కలగడానికి తన మామే కారణమని ఆ బాలిక వీడియోలో చెప్పింది.
అంతేకాకుండా, ఆ అరుదైన తెల్లని వల్గు పక్షిని తన మేనకోడలి కోసమే ఆమె మామ కొనుగోలు చేశాడంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే, ఈ విషయాన్ని ధృవీకరించే అధికారిక ఆధారాలు మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు.

Leave a Reply