అయ్యయ్యో.. ఇంజిన్ పనిచేయడం లేదు! గాల్లో అకస్మాత్తుగా తీవ్ర ఒడిదుడుకులకు గురైన విమానం.. పునర్జన్మ పొందిన 229 మంది ప్రయాణికులు! అత్యవసరంగా ల్యాండైన ఇండిగో విమానం..

గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఇండిగో విమానం మంగళవారం ఉదయం 9:16 గంటలకు యథావిధిగా బయలుదేరింది.

అయితే, విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే దాని ఇంజిన్‌లో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై, విమానాన్ని యూ-టర్న్ తీసుకుని మళ్లీ బయలుదేరిన విమానాశ్రయానికే తిప్పాలని నిర్ణయించారు.

విమానంలో ఇంజిన్ లోపం ఏర్పడిన విషయాన్ని తెలుసుకున్న విమానాశ్రయ అధికారులు వెంటనే అప్రమత్తమై, ఉదయం 9:25 గంటలకు ఎయిర్‌పోర్టులో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారు. పైలట్ నైపుణ్యం, సకాలంలో తీసుకున్న నిర్ణయం ప్రయాణికుల భద్రతను కాపాడటంలో కీలక పాత్ర పోషించాయి.

ఎలాంటి ప్రమాదం జరగకుండా, గోవా విమానాశ్రయంలో ఉదయం 9:50 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 229 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *