మంజీత్ కౌర్ ప్రాణాల కోసం సుమారు 54 రోజుల పాటు పోరాడి, చివరకు ఆగస్టు 26న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఈ హృదయ విదారక ఘటన ఆమె ఏడేళ్ల చిన్నారిని తల్లి ప్రేమకు దూరం చేసి అనాథగా మార్చింది.
మంజీత్కు కొన్ని వారాల క్రితమే స్పృహ వచ్చినప్పటికీ, పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని (స్టేట్మెంట్) నమోదు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పోలీసుల ఈ ఘోర ఉదాసీనత న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది.
ప్రస్తుతం ఈ ఘటనపై చండీగఢ్ పోలీసులు కిడ్నాప్, హత్య కింద కేసులు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించడంతో పాటు, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై కూడా సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply