ముంబై అంధేరి తూర్పు ప్రాంతానికి చెందిన సుశీల్ శర్మ (46) అనే వ్యక్తి, మలాడ్ పరిధిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఆయన గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రోజూలాగే తన మోటార్ సైకిల్‌పై విధులకు బయలుదేరాడు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో గోరేగావ్ తూర్పులోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే ఆరే ఫ్లైఓవర్‌పై వెళ్తుండగా, ఎడమ వైపు నుంచి వచ్చిన ఒక లారీ ఆయన బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సుశీల్ కిందపడిపోగా, లారీ చక్రాలు ఆయనపై నుంచి దూసుకెళ్లాయి. బాటసారులు, ఓ టెంపో డ్రైవర్ సాయంతో ఆయనను హుటాహుటిన జోగేశ్వరి ట్రామా కేర్ సెంటర్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.

Leave a Reply