ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ప్రాంతంలో, నిఘాసన్-పాలియా హైవేపై వెళ్తున్న ఒక కారు.. ఎదురుగా బైక్పై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టకుండా తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న 10 అడుగుల లోతైన గుంతలోకి బోల్తా పడింది.
గుంతలో పడిన వెంటనే ఆ కారు వేగంగా నీటిలో మునిగిపోవడం ప్రారంభించింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఐదుగురు స్నేహితులు ఈ ప్రమాదాన్ని చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నీటిలోకి దూకారు.
దేవదూతల్లా రంగంలోకి దిగిన ఆ ఐదుగురు స్నేహితులు.. కారులో చిక్కుకుపోయిన వారందరినీ ప్రాణాపాయం నుండి చాకచక్యంగా కాపాడి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ప్రాణాలను లెక్కచేయకుండా సమయస్ఫూర్తితో స్పందించి అందరినీ కాపాడిన ఆ యువకుల సాహసాన్ని స్థానికులు వేనోళ్ల కొనియాడుతున్నారు.

Leave a Reply