ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లా రూర్కీ ప్రాంతంలో.. వివేక్ అనే వ్యక్తి తన సోదరీమణులైన శకుంతల, పుష్పల ప్రవర్తనపై అనుమానంతో వారిద్దరినీ దారుణంగా హత్య చేశాడు.
చెల్లెళ్ల ప్రవర్తన వల్ల కుటుంబ పరువు పోతోందని భావించి, వివాహితులైన తన సోదరీమణులపై చాలా రోజులుగా నిఘా ఉంచినట్లు అరెస్టయిన వివేక్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.
తన సోదరీమణులు తప్పుడు మార్గంలో వెళ్తున్నారని బలంగా నమ్మిన వివేక్.. స్వయంగా వారి అత్తింటికి వెళ్లి ఇద్దరినీ వేర్వేరుగా అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ దాడి సమయంలో అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వివేక్ బావమరిదిపై కూడా కాల్పులు జరపడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను, దిగ్భ్రాంతిని కలిగించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే స్పందించి, తప్పించుకుని పారిపోయిన నిందితుడు వివేక్‌ను అరెస్ట్ చేసి కఠిన చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

Leave a Reply