బెంగళూరుకు చెందిన వాణి (22) అనే యువతి, తన మాజీ క్లాస్‌మేట్ అభిషేక్ నిరంతర బ్లాక్‌మెయిలింగ్, లైంగిక వేధింపులు భరించలేక ఆగరా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని నింపింది.
“అతడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను అతని గదికి వెళ్లాల్సి వచ్చేది” అని ఆమె తన చివరి సూసైడ్ నోట్‌లో కన్నీటితో ఆవేదన వ్యక్తం చేసింది.
గత ఏడాది కాలంగా అభిషేక్, వాణికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని ఆమెను తీవ్రంగా వేధిస్తున్నాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుటుంబ పరువు తీస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వరుస బెదిరింపులతో వాణి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.
తన మరణానికి అభిషేక్ మాత్రమే పూర్తి కారణమని వాణి తన సూసైడ్ నోట్‌లో స్పష్టంగా రాసింది. ఈ లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు అభిషేక్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave a Reply