“అయ్యో..! స్విమ్మింగ్ పూల్‌లో పడి కొట్టుమిట్టాడిన రెండేళ్ల చిన్నారి”.. ఆలోచించకుండా నీళ్లలోకి దూకి ప్రాణాలు కాపాడిన శునకం.. నోరెళ్లబెట్టే నిజమైన వీడియో!

బ్రెజిల్‌లోని కుయాబా నగరంలో, స్విమ్మింగ్ పూల్‌లో పడి నీళ్లలో కొట్టుమిట్టాడిన రెండేళ్ల చిన్నారిని ‘తెరెసా’ అనే గోల్డెన్ రిట్రీవర్ జాతి శునకం చాకచక్యంగా వ్యవహరించి కాపాడిన హృద్యమైన ఘటన ఇంటర్నెట్‌లో ప్రశంసలు అందుకుంటోంది.

బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు, పెద్దలు ఎవరూ దగ్గర లేని సమయంలో మైటే అనే ఆ చిన్నారి ఒంటరిగా స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి, కాలు జారి నీటిలో పడిపోయింది.

పాప నీటిలో మునిగిపోయి తల్లడిల్లుతుండటాన్ని గమనించిన అక్కడే ఉన్న ‘తెరెసా’ అనే పెంపుడు శునకం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి పాప దగ్గరకు వెళ్లింది. పాప మునిగిపోకుండా తనను పట్టుకునేలా అవకాశం ఇస్తూ, బంధువులు పరుగెత్తుకుంటూ వచ్చే వరకు పాపను నీటిపై తేలేలా చేసి కాపాడింది. వెంటనే దీనిని గమనించిన ఇద్దరు మహిళా బంధువులు పూల్‌లోకి దూకి పాపను, శునకాన్ని క్షేమంగా బయటకు తీశారు.

ఈ ఘటన గురించి పాప తల్లి గ్లాడిస్సా మాట్లాడుతూ, తన ఆడపడుచు ఇంట్లో ఈ సంఘటన జరిగిందని, తాను కేక్ ముక్క తీసుకురావడానికి, పెద్ద కూతురు శునకానికి స్నానం చేయించే టబ్ తీసుకోవడానికి కొన్ని సెకన్ల పాటు అక్కడి నుండి వెళ్లిన సమయంలో పాప పూల్‌లోకి దిగిపోయిందని తెలిపారు. సాధారణంగా ఎవరైనా తోడు వస్తేనే స్విమ్మింగ్ పూల్‌లోకి దిగే మైటే, ఆ రోజు అమాయకంగా ఒంటరిగానే దిగడంతో ఈ ప్రమాదం జరిగింది.

స్విమ్మింగ్ పూల్స్ దగ్గర రెండు సెకన్లలోనే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరిక కోసమే ఈ వీడియోను పంచుకున్నట్లు గ్లాడిస్సా పేర్కొన్నారు. సరైన సమయంలో స్పందించి తన కూతురి ప్రాణాలు కాపాడిన తెరెసా శునకానికి కృతజ్ఞతలు తెలిపిన ఆమె, ఈ ఘటన తర్వాత పాప, శునకం ఆనందంగా ఆడుకుంటున్న మరొక వీడియోను కూడా పంచుకున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *