“ఇంకా ఈ AI తో ఏమేం చేయబోతున్నారో!”.. టాయిలెట్‌లో కొండచిలువ.. 48 గంటల పాటు గాలించిన పోలీసులు.. చివరకు 9 ఏళ్ల బాలుడు ఇచ్చిన షాక్!

ఇటలీలోని కాస్టెల్‌ఫిడార్డో ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో, టాయిలెట్ నుంచి భారీ కొండచిలువ బయటకు వస్తున్నట్లు ఉన్న ఫోటో బయటకు రావడంతో తీవ్ర కలకలం రేగింది.

దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, అపార్ట్‌మెంట్ అంతా గాలించినప్పటికీ పాము జాడ కనిపించలేదు. ఒకవేళ తెరిచి ఉన్న కిటికీ గుండా పాము బయటకు వెళ్లిపోయి ఉండవచ్చని అనుమానించిన అధికారులు, గాలింపు చర్యలను కొనసాగించారు.

ఈ క్రమంలో, మరుసటి రోజే అరుదైన, విదేశీ జీవులను సంరక్షించే సీఐటీఈఎస్ (CITES) విభాగం అధికారులు కూడా ఈ గాలింపులో చేరారు. సుమారు 48 గంటల పాటు కొనసాగిన ఈ ఉత్కంఠ నడుమ, అధికారులు ఆ ఫోటోను క్షుణ్ణంగా పరిశీలించగా, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో రూపొందించిన నకిలీ చిత్రమని తేలింది. దీంతో కొండచిలువ కోసం గాలింపును విరమించారు. అనంతరం జరిపిన విచారణలో, 9 ఏళ్ల బాలుడు తన స్నేహితుడి ఇంటికి వెళ్లినప్పుడు ఏఐ సహాయంతో టాయిలెట్ నుంచి కొండచిలువ వస్తున్నట్లు ఫోటోను సృష్టించి, దానిని మొదట తన కుటుంబ సభ్యులకు చూపించినట్లు వెల్లడైంది.

బాలుడిని విచారించగా, తానే ఆ ఫోటోను రూపొందించినట్లు అంగీకరించాడు. అతని వయసును దృష్టిలో ఉంచుకుని ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోబోమని అధికారులు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే చిత్రాలు ఎంత వాస్తవంగా కనిపిస్తాయో, వాటి వల్ల అనవసరమైన ఆందోళన ఎలా కలుగుతుందో ఈ ఘటన స్పష్టం చేసింది. కాబట్టి, సోషల్ మీడియాలో షాకింగ్ ఫోటోలు లేదా వీడియోలు కనిపించినప్పుడు వాటి వాస్తవికతను నిర్ధారించుకోకుండా నమ్మకూడదని, ఇతరులతో పంచుకోకూడదని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *