ఇండియా పాకిస్థాన్ లాగే..! “ఇక మేం కూడా ఆడం”. ఆఫ్ఘనిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను తెంచుకున్న ప్రముఖ దేశం. ఎందుకో తెలుసా, అకస్మాత్తుగా ఏం జరిగింది.?

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత మహిళలు, బాలికలపై విధిస్తున్న కఠిన ఆంక్షలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు నిరసనగా స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

దీని ప్రకారం, ఐసీసీ (ICC) నిర్వహించే టోర్నీలు మినహా, ఇకపై ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో ద్వైపాక్షిక లేదా త్రైపాక్షిక క్రికెట్ సిరీస్‌లలో పాల్గొనబోమని స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సంచలన ప్రకటన చేసింది.

ఇటీవల జరిగిన స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. దీనిపై బోర్డు విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ‘ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళల క్రికెట్, ప్రాథమిక మానవ హక్కుల పరిస్థితులు మెరుగుపడే వరకు ఆ దేశ పురుషుల జట్టుతో స్కాట్లాండ్ ఎలాంటి ద్వైపాక్షిక లేదా త్రైపాక్షిక సిరీస్‌లు ఆడదు’ అని స్పష్టం చేసింది. 2021లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి అక్కడ మహిళల విద్య, ఉపాధి, క్రీడలపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే.

క్రీడా రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, లింగ సమానత్వాన్ని పెంపొందించడాన్ని స్కాట్లాండ్ క్రికెట్ తన ప్రధాన విధానంగా కలిగి ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై ఈ అణచివేత కొనసాగుతున్నంత కాలం వారితో కలిసి ఆడటం తమ విధానాలకు విరుద్ధం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఐసీసీ నిర్వహించే ప్రపంచ కప్ లాంటి అధికారిక అంతర్జాతీయ టోర్నీలలో మాత్రం ఆఫ్ఘనిస్థాన్‌తో యథావిధిగా ఆడతామని స్కాట్లాండ్ స్పష్టం చేసింది.

స్కాట్లాండ్ కంటే ముందే, మహిళల హక్కుల ఉల్లంఘనలను కారణంగా చూపుతూ క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డులు కూడా ఆఫ్ఘనిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను రద్దు చేసుకున్న విషయం గమనార్హం. మరోవైపు, ఇస్లామిక్ చట్టాలు, స్థానిక సంస్కృతికి లోబడే మహిళల హక్కులను పరిరక్షిస్తున్నామని, ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని తాలిబన్ ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *