మొబైల్ ఇంటర్నెట్ డేటాతో పనిలేకుండా కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే చేసుకోవాలనుకునే కస్టమర్ల కోసం వొడాఫోన్ ఐడియా (Vi) సంస్థ ఆరు కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) మార్గదర్శకాల మేరకు ఈ సరికొత్త ప్లాన్లను ప్రవేశపెట్టారు. రూ.179 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్లాన్లలో అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ (SMS) సదుపాయాలు లభిస్తాయి. అయితే, సాధారణ మొబైల్ ఇంటర్నెట్ డేటా మాత్రం వీటిలో ఉండదు.
రూ.179 ప్లాన్‌లో 25 రోజుల వాలిడిటీతో పాటు అన్లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అదనంగా ‘వి (Vi) మూవీస్ అండ్ టీవీ’ యాప్ యాక్సెస్ కూడా అందిస్తున్నారు. రూ.185 ప్లాన్‌కు 28 రోజులు, రూ.203 ప్లాన్‌కు 30 రోజుల వాలిడిటీ ఉంటుంది. రూ.206 ప్లాన్ పూర్తి క్యాలెండర్ నెలకు వర్తిస్తుంది. ఈ మూడు ప్లాన్లలో కూడా అన్లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
దీర్ఘకాలిక వాలిడిటీ కోరుకునే వారి కోసం రూ.470 ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 84 రోజుల వాలిడిటీతో పాటు అన్లిమిటెడ్ కాల్స్, 900 ఎస్ఎంఎస్లు వస్తాయి. అదేవిధంగా, ఏడాది పాటు వాలిడిటీ ఇచ్చే ప్లాన్ ధర రూ.1,849గా నిర్ణయించారు. ఇందులో 365 రోజుల సర్వీస్ వాలిడిటీతో పాటు అన్లిమిటెడ్ కాల్స్, మొత్తం 3,600 ఎస్ఎంఎస్లు అందుబాటులో ఉంటాయి. పదే పదే రీఛార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వినియోగదారులకు ఈ ప్లాన్ ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
ఇంటర్నెట్ డేటా లేకుండా కేవలం వాయిస్ కాల్స్, మెసేజ్‌లు (SMS) మాత్రమే వాడుకోవాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకునే ఈ ప్లాన్లను రూపొందించారు. ముఖ్యంగా ఇంట్లో వైఫై (Wi-Fi) సౌకర్యం ఉన్నవారికి, ఇంటర్నెట్ ఎక్కువగా వాడని వారికి, దీనిని రెండో సిమ్గా (సెకండరీ సిమ్) ఉపయోగించే వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అయితే, మొబైల్ ఇంటర్నెట్ డేటా కావాలనుకునే వారు అదనంగా డేటా ప్యాక్ (యాడ్-ఆన్) వేసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులు రీఛార్జ్ చేసుకునే ముందు వి (Vi) సంస్థ యాప్ లేదా వెబ్సైట్లో తమ ఫోన్ నంబర్‌కు వర్తించే ప్లాన్ ధరలు, అందుబాటులో ఉన్న ప్రయోజనాలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.

Leave a Reply