“ఇక నేను బతకలేను..” వీడియో పోస్ట్ చేసి అదృశ్యమైన భర్త! కాలువలో దూకేశాడని వెతికిన పోలీసులు.. 48 గంటల తర్వాత ఎక్కడ దొరికాడో తెలుసా?

హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల అర్మాన్, అతడి భార్య మధ్య చాలాకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యతో తలెత్తిన విభేదాల కారణంగా అర్మాన్ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో తన భార్య తనను మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ, “ఆగ్రా కాలువలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నాను” అని పేర్కొన్నాడు.

ఈ వీడియో చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై అర్మాన్ కోసం వెతకడం ప్రారంభించారు. ఇదే సమయంలో, కాలువ సమీపంలోని కట్లా వంతెన వద్ద అతడి సెల్‌ఫోన్, పల్సర్ బైక్ లభ్యమయ్యాయి. దీంతో అతడు నిజంగానే కాలువలో దూకి ఉంటాడని పోలీసులు అనుమానించారు. వెంటనే పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది కలిసి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.

దాదాపు 48 గంటల పాటు నిరంతరాయంగా గాలించినా అర్మాన్ ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ ఆటోలో ప్రయాణిస్తున్న అర్మాన్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. అతడు కాలువలో దూకలేదని, తన నిర్ణయాన్ని మార్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తేలింది. పుట్టబోయే బిడ్డ భవిష్యత్తును తలుచుకుని ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.

అర్మాన్ భార్య ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. వీరిద్దరి మధ్య గతంలోనూ గొడవలు జరిగినప్పుడు పోలీసులు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. ప్రస్తుతం అర్మాన్ సురక్షితంగా దొరకడంతో, భార్యాభర్తలిద్దరినీ కుటుంబ సభ్యులతో సహా పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. 48 గంటల పాటు కాలువలో వెతికిన యువకుడు చివరకు ఆటోలో ప్రాణాలతో కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *