“ఇతన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి..” అచ్చం సెహ్వాగ్‌ను చూసినట్టే ఉంది.. సెహ్వాగ్ తనయుడిపై అశ్విన్ సంచలన అంచనా.!!

అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో అద్భుతంగా రాణించిన యువ ఆటగాడు ఆర్యవీర్ సెహ్వాగ్‌పై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ టోర్నీలో ఆర్యవీర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడని, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ (టోర్నీ అత్యుత్తమ ఆటగాడు) అవార్డుకు అతను పూర్తిగా అర్హుడని అశ్విన్ కొనియాడారు.

టోర్నీ ఆద్యంతం ఎలాంటి తప్పిదాలు చేయకుండా నిలకడగా పరుగులు సాధించిన ఆర్యవీర్ బ్యాటింగ్‌లో, అతని తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అశ్విన్ పేర్కొన్నారు.

భవిష్యత్తులో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించే అత్యుత్తమ ఆటగాడిగా ఆర్యవీర్ ఎదుగుతాడని, భవిష్యత్తులో అతని ఆటను చూడటానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అశ్విన్ ధీమా వ్యక్తం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *