కర్ణాటకలోని హాసన్ జిల్లా ఆలూర్ తాలూకా సింగపూర్ గ్రామానికి చెందిన అనుశ్రీ (28), శ్రీనివాస్ ప్రేమ వివాహం చేసుకున్నారు.
శ్రీనివాస్ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఉపాధి నిమిత్తం గత రెండు నెలల క్రితమే ఆలూర్ హౌసింగ్ బోర్డ్ పరిధిలోని ఒక అద్దె ఇంట్లోకి మారారు.
ఈ క్రమంలో, శ్రీనివాస్ యథావిధిగా డ్యూటీకి వెళ్లిన సమయంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న అనుశ్రీ తన 2 ఏళ్ల కుమారుడు ఆర్యన్ గొంతు నులిమి హత్య చేసి మంచంపై పడుకోబెట్టింది. అనంతరం, అదే గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతుల మధ్య ఏదైనా కుటుంబ కలహాలు ఉన్నాయా లేక తీవ్రమైన మానసిక ఒత్తిడి (డిప్రెషన్) వల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందా అనే కోణంలో ఆలూర్ పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply