“ఎలా మనసొచ్చింది, వీళ్లంతా మనుషులేనా?”.. రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని సజీవ సమాధి చేసిన కిరాతకులు.. కన్నతల్లి ఇచ్చిన రహస్య సమాచారం.. రామేశ్వరం సమీపంలో హృదయాన్ని కలచివేసే ఘటన!

రామేశ్వరం సమీపంలో పుట్టిన కొన్ని నిమిషాలకే ఓ పసికందు (ఆడపిల్ల)ను సజీవంగా మట్టిలో పాతిపెట్టి చంపిన కిరాతక ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది. లోకనందిని అనే మహిళకు ఇంట్లోనే ప్రసవం జరగగా, ఆమెకు అందమైన ఆడపిల్ల పుట్టింది. అప్పటికే ఒక ఆడపిల్ల ఉన్న నేపథ్యంలో, రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టడంతో అసంతృప్తి చెందిన కుటుంబ సభ్యులు ఆ పసికందును ప్రాణాలతోనే మట్టిలో పాతిపెట్టారు.

ఈ అమానవీయ ఘటనపై చిన్నారి తల్లి లోకనందిని పోలీసులకు సమాచారం అందించడంతో, వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మట్టిలో పాతిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, చిన్నారి తండ్రి నాగపాండి సహా ముగ్గురిని అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు.

ఈ ఆధునిక కాలంలోనూ ఆడపిల్ల అనే కారణంతో పుట్టిన కొన్ని నిమిషాల్లోనే ఓ పసిప్రాణాన్ని బలితీసుకున్న ఈ ఘటన సామాజిక కార్యకర్తలు, ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష విధించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలను ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *