ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలోని సర్వోదయ కన్యా బాల్ విద్యాలయ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న అవని అనే విద్యార్థిని, పాఠ్యపుస్తకం తీసుకురాలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు ఆమెను ఎండలో నిలబెట్టి, కొట్టి, బాత్రూంలో బంధించింది.
దీంతో ఆ బాలిక ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించగా, ఐదు రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందుతూ ఆమె దయనీయంగా ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన అనంతరం బాలిక అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఈ ఘటనపై విద్యాశాఖ డైరెక్టరేట్ ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది.
చదువుకోవడానికి బడికి వెళ్లిన బాలికకు ఎదురైన ఈ విషాద ఘటన, ఉపాధ్యాయుల హింసాత్మక ప్రవర్తనను, బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపడంతో పాటు విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతను నిర్ధారించాల్సిన అవసరాన్ని మరోసారి గట్టిగా గుర్తుచేస్తోంది.

Leave a Reply