“ఏయ్.. మా ఫోన్ ఎక్కడే?” నర్సింగ్ కాలేజీలో అర్ధరాత్రి దాడులు.. విద్యార్థినుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఆంధ్రప్రదేశ్‌లో కలకలం!

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్రాంతంలో ఉన్న ఎస్.కె. నర్సింగ్ కళాశాలలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులకు, స్థానిక తెలుగు విద్యార్థినులకు మధ్య అర్ధరాత్రి పూట తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.

ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని మొబైల్ ఫోన్ కనిపించకుండా పోవడమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ఫోన్ చోరీ విషయమై తలెత్తిన వాగ్వాదం కాస్తా ముదిరి, చివరకు ఇరువర్గాలు బాహాబాహీకి దిగి పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది.

ఈ ఘర్షణ సమయంలో కళాశాల యాజమాన్యం, స్థానిక సిబ్బంది తమ గోడును పట్టించుకోకుండా స్థానిక విద్యార్థినులకే వత్తాసు పలికారని ఈశాన్య రాష్ట్రాల విద్యార్థినులు ఆరోపించారు. తమకు న్యాయబద్ధమైన విచారణ దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కళాశాల ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు యాజమాన్యం రంగంలోకి దిగింది.

భద్రతా కారణాల దృష్ట్యా ఈశాన్య రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 31 మంది విద్యార్థినులను తాత్కాలికంగా వేరొక హాస్టల్‌కు తరలించారు. ఈ ఘటనపై మణిపూర్ రాష్ట్ర నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి ఈశాన్య రాష్ట్రాల విద్యార్థినుల భద్రతను పటిష్టం చేయాలని కోరారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *