ఒక్క ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేయలేదు. వెతుక్కుంటూ వచ్చిన 4 కంపెనీల జాబ్ ఆఫర్లు.! సగటు జీతం రూ.19 లక్షలు. లక్షలాది మంది ఉద్యోగాల కోసం తిరుగుతుంటే, ఈ యువకుడు పాటించిన రహస్య పద్ధతి ఏంటో తెలుసా.?

ఉద్యోగాల కోసం వెతికే వారు రోజూ లింక్డ్‌ఇన్ (LinkedIn), నౌకరీ (Naukri) లాంటి జాబ్ పోర్టల్స్‌లో ఎన్నో కంపెనీలకు దరఖాస్తు చేస్తూ, ఎలాంటి స్పందన రాక తీవ్ర నిరాశకు గురవుతుంటారు.

కానీ, బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి మాత్రం.. 2026 సంవత్సరంలో తాను ఎలాంటి జాబ్ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయకుండానే ఏకంగా నాలుగు జాబ్ ఆఫర్లు సాధించినట్లు తెలిపాడు. ఈ నాలుగు ఉద్యోగాల సగటు వార్షిక జీతం సుమారు రూ.19 లక్షలు ఉంటుందని, అందులో ఒక ఆఫర్ వై కాంబినేటర్ (Y Combinator) మద్దతు ఉన్న సంస్థ నుంచి వచ్చిందని అతను చెప్పాడు.

అతను పాటించిన మొదటి పద్ధతి.. లింక్డ్‌ఇన్‌లో కొత్తగా వచ్చే జాబ్ పోస్ట్‌లను గమనించడం. ముఖ్యంగా, గడిచిన 24 గంటల్లో పోస్ట్ చేయబడి, 100 కంటే తక్కువ లైక్స్/ఆసక్తి వచ్చిన జాబ్ పోస్ట్‌లను వెతకాలని అతను సూచించాడు. ఆ పోస్ట్‌లు పెట్టిన వ్యక్తుల ఈమెయిల్ ఐడీని కనుక్కుని, నేరుగా వారికి సంక్షిప్తంగా ఒక ఈమెయిల్ పంపాలని, ఐదు లైన్లలోపు తమ నైపుణ్యాలను (స్కిల్స్), ఉద్యోగం పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేయడం మంచిదని చెప్పాడు.

ఇక రెండో పద్ధతి.. కొత్తగా పెట్టుబడులు (ఫండింగ్) పొందిన కంపెనీలపై ఓ కన్నేసి ఉంచడం. ముఖ్యంగా, తొలి దశలో (ఎర్లీ-స్టేజ్) పెట్టుబడులు సాధించిన స్టార్టప్‌లు తమ బృందాన్ని (టీమ్‌ను) విస్తరించుకోవాలని ప్లాన్ చేస్తుంటాయి కాబట్టి, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ముందుగా ఆ కంపెనీ ఏం చేస్తుందో అర్థం చేసుకుని, మీ నైపుణ్యాలు వారికి ఏ విధంగా ఉపయోగపడతాయో విశ్లేషించాలి. ఆ తర్వాత కంపెనీ ఫౌండర్లతో సహా ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులను ఎంచుకుని, వారికి నేరుగా ఈమెయిల్ పంపాలి. ఇలా రోజూ సుమారు 20 ఈమెయిల్స్ పంపుతూ నిరంతరం ప్రయత్నించాలని అతను సూచించాడు.

ఈమెయిల్స్ రాయడానికి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌పై ఆధారపడకూడదని, సహజమైన భాషలో వ్యక్తిగతంగా రాయడమే మంచిదని అతను తెలిపాడు. అదే సమయంలో, కొత్త జాబ్ పోస్ట్‌లు, పెట్టుబడులు పొందిన కంపెనీలను కనుక్కోవడానికి మాత్రం ఏఐ టూల్స్‌ను వాడుకోవచ్చని పేర్కొన్నాడు. ఇలా నిరంతరం ప్రయత్నిస్తే రెండో వారంలోనే ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశం ఉందని అతను చెప్పినప్పటికీ.. ఈ పద్ధతి ద్వారా కచ్చితంగా ఉద్యోగం వస్తుందనే గ్యారెంటీ ఏమీ లేదు. అవసరమైన నైపుణ్యం, అనుభవం ఉంటేనే ఉద్యోగం సాధించగలమనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *