ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరి జిల్లాకు చెందిన డానిష్ (40) అనే కార్మికుడు, మహారాష్ట్రలోని ఒక బెల్లం తయారీ యూనిట్లో పనిచేస్తూ ఊహించని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.
శుక్రవారం మధ్యాహ్నం ఫ్యాక్టరీలో బెల్లం పాకం కాచే పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో, అతడు ప్రమాదవశాత్తు కాలు జారి బ్యాలెన్స్ తప్పి మరుగుతున్న భారీ కొప్పెర (బాణలి) లోపల పడిపోయాడు.
దీంతో అతడికి తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. అక్కడే ఉన్న తోటి కార్మికులు వెంటనే స్పందించి అతడిని కొప్పెరలో నుంచి బయటకు లాగి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, ఐసీయూలో తీవ్ర చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
ఈ వెన్నులో వణుకు పుట్టించే ప్రమాద దృశ్యాలు మొత్తం ఫ్యాక్టరీలోని సీసీటీవీ కెమెరాలో రికార్డై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘోర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply