“ఒరేయ్.. నన్ను వదిలేసి ఇంకొకరితో ఊళ్లు తిరుగుతున్నావా..?” తింటున్న భర్త చెంప చెళ్లుమనిపించిన భార్య.. హోటల్‌లో చితకబాదిన వైనం.. షాకింగ్ వీడియో..!

భార్యాభర్తల మధ్య తలెత్తే మనస్పర్థలు, గొడవలు కొన్నిసార్లు బహిరంగ ప్రదేశాల్లో తీవ్ర రచ్చకు, గందరగోళానికి దారితీస్తుంటాయి.

అదే కోవలో, తన భర్త మరో మహిళతో కలిసి రెస్టారెంట్‌లో కూర్చుని స్నాక్స్ తింటుండటం చూసిన భార్య.. అక్కడే తీవ్ర వాగ్వాదానికి దిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

ఓ స్థానిక రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి తన మహిళా స్నేహితురాలితో కలిసి కూర్చుని సమోసా, టీ తాగుతున్నట్లు సమాచారం. ఆ సమయంలో అనుకోకుండా అక్కడికి వచ్చిన అతని భార్య.. భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి, ఆగ్రహానికి గురైంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె, వెంటనే భర్తతో పాటు ఆ మహిళతోనూ గొడవకు దిగింది.

చిన్నగా మొదలైన ఈ వాగ్వాదం, నిమిషాల వ్యవధిలోనే అదుపు తప్పి పెద్ద ఘర్షణగా మారింది. కోపం కట్టలు తెంచుకోవడంతో ఆ భార్య.. తన భర్తపై, అతడితో ఉన్న మహిళపై కూడా దాడి చేసినట్లు చెబుతున్నారు. రెస్టారెంట్‌లో ఉన్న ఇతర కస్టమర్లు, ప్రజలు ఈ ఘటనను చూసి షాక్‌కు గురయ్యారు. ఒక సాధారణ టీ టైమ్‌గా మొదలైన వ్యవహారం.. అకస్మాత్తుగా పబ్లిక్‌లో పెద్ద గొడవగా మారడంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

ఈ మొత్తం ఘటనను అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు పలువురు.. భార్య కోపంలో న్యాయం ఉందని అభిప్రాయపడుతున్నప్పటికీ, వ్యక్తిగత సమస్యలను ఇలా బహిరంగ ప్రదేశాలకు తీసుకొచ్చి గొడవ పడటం సరైన పద్ధతి కాదని పేర్కొంటున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది, దీనిపై పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా అనే దానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెలువడలేదు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *