కన్నీళ్లు పెట్టించే నిజాలు: టిసిఎస్ (TCS) ఉద్యోగి ఆత్మహత్యకు అసలు కారణం ఇదే! ఇద్దరు మహిళా ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్!

పుణెలోని పింప్రి-చించ్వాడ్ పరిధిలో గల భోసరి ప్రాంతంలో నివాసముంటున్న 48 ఏళ్ల టిసిఎస్ ఉద్యోగి అమిత్ బ్రహ్మే ఆత్మహత్య కేసులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీకి చెందిన ఇద్దరు మహిళా సహోద్యోగులతో పాటు వినోద్ పాలిచా అనే మరో వ్యక్తి తనను తీవ్రంగా వేధించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

భోసరిలోని ‘సువిధా పార్క్’ ప్రాంతంలో నివసించే అమిత్, జూన్ 2న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనిపై మృతుడి 19 ఏళ్ల కుమారుడు జూన్ 9న భోసరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 3(5) కింద కేసు నమోదు చేశారు.

సహా ఉద్యోగుల క్రూరత్వం.. భార్యకు క్యాన్సర్ ఉన్నా వదల్లేదు!
ఈ ఆత్మహత్యకు గల ప్రధాన కారణాలను ఏఎస్పీ సుధాకర్ మీడియాకు వివరిస్తూ.. అమిత్ బ్రహ్మే రాసిన సుదీర్ఘ డెత్ నోట్‌లో తన ఆవేదననంతా వ్యక్తం చేశారని తెలిపారు.

అమిత్ బ్రహ్మే హింజేవాడిలోని టిసిఎస్ (TCS) సంస్థలో ప్రాజెక్ట్ ఉద్యోగిగా పనిచేసేవారు. అదే ప్రాజెక్ట్‌లో ఉన్న ఇద్దరు మహిళా సహోద్యోగులు ఆయనను సమయం దొరికినప్పుడల్లా ఆఫీసులో అవమానిస్తూ, వేధించేవారు.

ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ రివ్యూలలో కావాలనే నెగెటివ్ రేటింగ్ ఇస్తామని బెదిరించేవారు.

కన్నీరు పెట్టించిన అంశం: అమిత్ బ్రహ్మే తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో, అలాగే ఆయన భార్యకు క్యాన్సర్ (Cancer) మహమ్మారి సోకిన తరుణంలో.. వారికి సేవలు చేయడానికి అమిత్ లీవ్స్ (సెలవులు) అడగగా, ఆ ఇద్దరు మహిళా ఉద్యోగులు సెలవులు ఇవ్వకుండా తీవ్రంగా మానసిక క్షోభకు గురిచేశారు. భార్య క్యాన్సర్ ప్రాణాంతక స్థితిలో ఉన్నా లీవ్ ఇవ్వకుండా ఆఫీస్ ఒత్తిడి పెంచడం ఆయనను తీవ్రంగా కుంగదీసింది.

మూడో నిందితుడి తప్పుడు ఈమెయిల్స్:
ఇక ఆఫీస్ వెలుపల అమిత్‌కు స్నేహితుడైన వినోద్ పాలిచా అనే వ్యక్తి కూడా ఈ వేధింపుల్లో తోడయ్యాడు. వినోద్ పాలిచా కావాలనే టిసిఎస్ కంపెనీ యాజమాన్యానికి అమిత్ గురించి పూర్తిగా తప్పుడు, అవాస్తవ ఈమెయిల్స్ పంపాడు. దీనివల్ల కంపెనీలో అమిత్ ఇమేజ్ (ప్రతిష్ట) పూర్తిగా దెబ్బతింది. అంతేకాకుండా, అమిత్‌పై పోలీసులకు కూడా కొన్ని తప్పుడు ఫిర్యాదులు ఇచ్చేందుకు వినోద్ ప్రయత్నించినట్లు డెత్ నోట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

పోలీసుల యాక్షన్:
భోసరి పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సందీప్ ఘోర్పడే మాట్లాడుతూ.. “మేము ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు ప్రారంభించాం. నిందితులైన ఆ ఇద్దరు మహిళా ఉద్యోగులను విచారించేందుకు వీలుగా టిసిఎస్ (TCS) యాజమాన్యానికి అధికారికంగా నోటీసులు జారీ చేశాం. ఇక మూడో నిందితుడు వినోద్ పాలిచా కోసం గాలింపు చర్యలు చేపట్టాం” అని తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *