కూటికి గతిలేని స్థితి! పాకిస్తాన్‌లో కొత్తగా దారిద్ర రేఖకు దిగువకు పడిపోయిన 2.7 కోట్ల మంది.. ఒక దేశపు దారుణ సోశం!

ఇస్లామాబాద్: పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో గత 6 ఏళ్ల కాలంలోనే పేదరిక రేటు ఏకంగా 7 శాతం పెరిగిందని, అక్కడ ఉన్న మొత్తం పేద ప్రజల సంఖ్య 7 కోట్లకు చేరిందని ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఇటీవలే పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ‘పాకిస్తాన్ ఎకనామిక్ సర్వే 2025-26’ నివేదిక ప్రకారం.. గత 2018-19 ఆర్థిక సంవత్సరంలో 21.9 శాతంగా ఉన్న పేదరిక తీవ్రత, ప్రస్తుతం 28.9 శాతానికి అమాంతం పెరిగింది. దీని కారణంగా, గత 6 సంవత్సరాల కాలంలోనే దాదాపు 2.7 కోట్ల మంది ప్రజలు కొత్తగా దారిద్ర్య రేఖకు దిగువకు పడిపోయారు. వీరంతా తమ దైనందిన కనీస ప్రాథమిక అవసరాలను, కడుపునిండా తిండిని కూడా పొందలేక అల్లాడిపోతున్నారని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో విలయతాండవం – పెరిగిన గిని సూచీ:
పాకిస్తాన్ జనాభాలో ఆదాయ పంపిణీలో ఉన్న తీవ్ర అసమానతలను చూపే గిని సూచీ (Gini Index) 28.4 నుండి 32.7 కి పెరిగింది. దేశంలోని పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలే ఈ పేదరికం వల్ల అత్యంత ఘోరంగా దెబ్బతిన్నాయి. పట్టణ ప్రాంతాల్లో పేదరిక రేటు 17.4 శాతంగా నమోదవగా, గ్రామీణ ప్రాంతాల్లో అది 36.2 శాతంతో విలయతాండవం చేస్తోంది.

వినాశనానికి గల ముఖ్య కారణాలు:
గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మహమ్మారి, పాకిస్తాన్‌ను ముంచెత్తిన భారీ వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, అదుపులేకుండా పెరిగిన ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల), కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడం మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కఠిన నిబంధనల వల్ల ప్రభుత్వం తీసుకున్న తప్పుడు ఆర్థిక విధానాలే ఈ ఘోర ఆర్థిక వినాశనానికి ప్రధాన కారణాలని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *