“క్యాన్సర్ గడ్డ అని భావించి ఆపరేషన్. 3 ఏళ్లుగా వృద్ధుడి ఛాతీలో ఉన్న రహస్యం.. నిరంతర దగ్గుకు కారణమైన విపరీతం. డాక్టర్లను నివ్వెరపరిచిన షాకింగ్ నిజం.!!”

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో ఉన్న ఒక ఆసుపత్రిలో, 72 ఏళ్ల వృద్ధుడు ఒకరు చాలా రోజులుగా నిరంతర దగ్గు, శ్వాసకోశ సమస్యతో చికిత్స కోసం చేరాడు.

పలు నెలలుగా ఇబ్బంది పెడుతున్న ఈ దగ్గు కోసం డాక్టర్లు చేసిన పరీక్షల్లో, అతని కుడివైపు ఊపిరితిత్తుల భాగంలో కణితులు లేదా క్యాన్సర్ ఉండొచ్చని తీవ్రంగా అనుమానించారు.

వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు డాక్టర్లు ‘బ్రాంకోస్కోపీ’ (Bronchoscopy) అనే కెమెరా పరీక్షను నిర్వహించారు. అప్పుడు అతని శ్వాసనాళంలో ఒక ఎర్రటి కణితి లాంటి భాగం ఉన్నట్లు గుర్తించారు. ఆ కణితిని తొలగించేందుకు ఆధునిక వైద్య పరికరాలను ఉపయోగించి డాక్టర్లు తీవ్ర చికిత్సను ప్రారంభించారు.

శ్వాసనాళంలో వాచిన కణజాలాలను డాక్టర్లు తొలగించినప్పుడు, దాని కింద ఒక కఠినమైన తెల్లటి వస్తువు దాగి ఉన్నట్లు తెలిసింది. చాలా కష్టపడి ఆ వస్తువును బయటకు తీసి చూసిన డాక్టర్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు క్యాన్సర్ గడ్డ అని భావించి ఆపరేషన్ చేసిన ఆ వస్తువు మరేదో కాదు; కొన్నేళ్ల క్రితం ఆ వృద్ధుడికి తెలియకుండానే అతని ఊపిరితిత్తుల్లోకి వెళ్లి చిక్కుకున్న అతని సొంత పన్ను.

దీని గురించి డాక్టర్లు జరిపిన విచారణలో, సుమారు మూడేళ్ల క్రితం ఆ వృద్ధుడికి మూర్ఛ వచ్చినప్పుడు అతని ఒక పన్ను విరిగి పడిపోయింది. ఆ పన్ను శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన విషయం అతనికి తెలియకుండానే ఏళ్లుగా అలాగే ఉండిపోయింది.

ఇదే అతనికి నిరంతర దగ్గు మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌కు కారణమైంది. ఈ విచిత్రమైన వైద్య ఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *