“గుండె తరుక్కుపోతోంది..! కనురెప్పపాటులో ఇద్దరు పోలీసుల దుర్మరణం.. నడిరోడ్డుపై జరిగిన ఘోరం.!!!”

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లో విధులకు హాజరవుతున్న ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

సోహ్నా రోడ్డులో బుధవారం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వీరిద్దరూ మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక డంపర్ లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి ఇద్దరూ రోడ్డుపై ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఈ ప్రమాదంలో నవీన్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన అభిషేక్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక అభిషేక్ కూడా మరణించారు. వీరిద్దరూ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్నారని, పర్వతీయ కాలనీ పోలీస్ చౌకీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారని అధికారులు తెలిపారు. సాధారణ పెట్రోలింగ్ విధుల్లో భాగంగా వీరిద్దరూ బైక్‌పై సోహ్నా రోడ్డు గుండా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ (CCTV) దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. పోలీసులు వెళ్తున్న మోటార్ సైకిల్‌ను డంపర్ లారీ ఢీకొట్టిన దృశ్యాలు అందులో స్పష్టంగా రికార్డయ్యాయని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డంపర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, అనంతరం ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ ఘటనపై సరణ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని, పరారైన డ్రైవర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఫరీదాబాద్ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. డ్రైవర్ నిర్లక్ష్యం, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *