ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ప్రేమ వ్యవహారానికి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో, 9వ తరగతి చదువుతున్న ఓ కబడ్డీ క్రీడాకారిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది. తన మణికట్టుపై ప్రియుడి పేరును మెహందీతో రాసి, ఆపై కత్తితో కోసుకుని ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
9వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థినికి కోచింగ్ తరగతులకు వెళ్లే సమయంలో అనుపమ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో గత ఏడాదిగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.
వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించగా, విద్యార్థిని కుటుంబ సభ్యులు దీనికి తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలిక, గతంలోనూ ఒకట్రెండు సార్లు తన మణికట్టు కోసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆ ప్రాంతంలో జరిగిన ఓ వివాహ ఊరేగింపు, వేడుకకు విద్యార్థిని కుటుంబ సభ్యులంతా వెళ్లారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పెళ్లి వేడుక నుంచి ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన ఆ విద్యార్థిని, తన గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంది. ముందుగా తన ప్రియుడు అనుపమ్ పేరును మణికట్టుపై మెహందీతో రాసుకుంది. ఆ పేరు చెరిగిపోకుండా ఉండేందుకు కత్తితో కోసుకుని, అనంతరం గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఉదయం పెళ్లి ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తల్లి, ఎంతసేపు తలుపు తట్టినా తీయకపోవడంతో కిటికీలోంచి తొంగి చూసింది. కుమార్తె ఉరివేసుకుని కనిపించడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయింది.
ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసిన అనంతరం రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కాల్ డేటా రికార్డ్ (CDR), పోస్ట్‌మార్టం నివేదికల కోసం వేచి చూస్తూ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply