“టర్కీ భారతదేశంపై దాడి చేస్తుందా..?” పాకిస్థాన్‌తో ఒప్పందం కారణంగా ఎర్డోగాన్‌కు స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత.. పార్లమెంటులో చెలరేగిన దుమారం..!!

టర్కీ, పాకిస్థాన్ మరియు సౌదీ అరేబియా మధ్య కుదిరిన పదేళ్ల ‘మక్కా భద్రతా ఒప్పందం’పై టర్కీ పార్లమెంటులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడమే కాకుండా, ఇది రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

ఈ ఒప్పందం కారణంగా, భవిష్యత్తులో భారత్ – పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే టర్కీ పాకిస్థాన్‌కు మద్దతుగా పోరాడుతుందా అని విపక్షాలు సంచలన ప్రశ్నలు సంధిస్తూ ప్రభుత్వాన్ని ఇరుక్కున పెడుతున్నాయి.

ఇతర దేశాల రాజకీయ ప్రయోజనాల కోసం టర్కీ దేశ యువత ప్రాణాలను పణంగా పెట్టకూడదని ప్రతిపక్ష నేతలు అధ్యక్షుడు ఎర్డోగాన్‌ను అత్యంత తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ, ఎర్డోగాన్ అధికార పార్టీ మరియు దాని మిత్రపక్షాల బలంతో టర్కీ పార్లమెంటులో ఈ మక్కా భద్రతా ఒప్పంద బిల్లు మెజారిటీతో ఆమోదించబడింది.

ఈ ఒప్పందం ప్రకారం టర్కీ వెంటనే యుద్ధానికి సైన్యాన్ని పంపలేకపోయినప్పటికీ, భవిష్యత్తులో విదేశాలకు బలగాలను పంపాలంటే మాత్రం పార్లమెంటు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నది గమనార్హం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *