టాయిలెట్ విషయంలో చెలరేగిన గొడవ.. హద్దు మీరిన యువకులు! 4 అడుగుల పైపుతో పెద్దపేగు దెబ్బతిన్న దారుణం.. చివరకు వైద్యులు చేసిన చికిత్స చూడండి!

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో టాయిలెట్ ఉపయోగించే విషయంలో తలెత్తిన గొడవ దారుణ దాడికి దారితీసింది. అక్కడి ఓ యువకుడిపై దాడి చేసిన కొందరు, అతడి మర్మాంగంలోకి సుమారు 4 అడుగుల పొడవున్న బాత్రూమ్ షవర్ పైపును చొప్పించినట్లు తెలుస్తోంది. ఆ పైపు పెద్దపేగును చీల్చుకుని పొట్ట భాగం వరకు వెళ్లడంతో, ఆ యువకుడిని ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తరలించారు.

గత నవంబర్ 12న అతడిని జోధ్‌పూర్‌లోని మధురాదాస్ మాథుర్ (MDM) ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో ఆ పైపు పెద్దపేగును తీవ్రంగా దెబ్బతీసిందని, పొట్టలోని ఇతర ముఖ్య అవయవాలు మరియు రక్తనాళాలకు కూడా హాని కలిగే ప్రమాదం ఉందని తేలింది. దీంతో వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.

నవంబర్ 13న జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ దినేష్ దత్ శర్మ నేతృత్వంలోని వైద్య బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. పేగులో చిన్న కోత పెట్టి, అంటే ‘ఎంటెరోటమీ’ (Enterotomy) పద్ధతిని ఉపయోగించి, సుమారు 4 అడుగుల పొడవున్న ఆ పైపును అత్యంత జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ శస్త్రచికిత్స సమయంలో ఇతర కీలక అవయవాలు, రక్తనాళాలకు మరింత నష్టం వాటిల్లకుండా వైద్యులు కాపాడగలిగారు.

ఇది చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స అని, వైద్య బృందం సమిష్టి కృషితో యువకుడి ప్రాణాలను కాపాడగలిగామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వికాస్ రాజ్‌పురోహిత్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆయుష్మాన్ ఆరోగ్య పథకం కింద అతడికి ఉచితంగా చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *