సుమారు నెల రోజుల క్రితం తాను ప్రేమించిన యువతితో కలిసి వెళ్లి వివాహం చేసుకున్నాడు జగ్జీత్ సింగ్.
ఈ పెళ్లిని యువతి కుటుంబ సభ్యులు మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అన్నలైన జస్ప్రీత్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్ పగ తీర్చుకోవడానికి అదను కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో నిన్న బస్టాండ్ సమీపంలో నిలబడి ఉన్న జగ్జీత్ సింగ్‌పై ఆ ఇద్దరూ ఆకస్మికంగా కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో, అతడు తీవ్ర రక్తస్రావమై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు.
ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హత్య చేసి పరారైన ఇద్దరు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కుటుంబ పరువు పేరిట పథకం ప్రకారం చేసిన పరువు హత్య (ఆనర్ కిల్లింగ్) అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Leave a Reply