దీపావళికి ఎంజాయ్‌మెంట్ ఓకేనే..! అలాగని మరీ ఇంత ప్రమాదకరంగానా..? చేతిలో పట్టుకునే టపాసు వెలిగించిన యువకుడు.. చివరకు రక్తపు మడుగులో హాహాకారాలు.. జాగ్రత్తండోయ్ జాగ్రత్త..!

ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా ధర్మగర్ ప్రాంతానికి చెందిన పింటూ పటేల్ అనే యువకుడు, దీపావళి పండుగ వేడుకల్లో భాగంగా టపాసులు కాలుస్తున్నాడు.

అయితే, ప్రమాదం పొంచి ఉందనే విషయం గ్రహించకుండా ఓ టపాసును తన చేతిలో పట్టుకునే వెలిగించే ప్రయత్నం చేశాడు.

అతడు చేతిలో పట్టుకుని ఉండగానే ఆ టపాసు ఊహించని విధంగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ యువకుడి అరచేయి, వేళ్లు దారుణంగా ఛిద్రమై రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.

అతడి అరుపులు, హాహాకారాలు విని పరుగెత్తుకొచ్చిన బంధువులు, చుట్టుపక్కల వారు.. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ధర్మగర్ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ అతడికి ప్రథమ చికిత్స అందించారు.

అయితే, చేతికి తగిలిన గాయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, మెరుగైన చికిత్స కోసం భవానీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. దీపావళి రోజున నిర్లక్ష్యంగా టపాసులు కాల్చడం వల్ల జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలాన్ని, విషాదాన్ని నింపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *