“దీపావళి ప్రయాణికులకు షాకింగ్ న్యూస్..!” రైల్వే స్టేషన్లలోకి ఆ వస్తువులు తీసుకువెళ్లడంపై నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన శిక్ష.. రైల్వే శాఖ సంచలన ప్రకటన..!!

రైళ్లు, రైల్వే స్టేషన్ పరిసరాల్లోకి బాణసంచా (టపాసులు), సులభంగా మంటలంటుకునే ప్రమాదకరమైన వస్తువులను ప్రయాణికులు తీసుకువెళ్లకూడదని చెన్నై రైల్వే డివిజన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

పండుగ సమయాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే నేపథ్యంలో, భద్రతాపరమైన ముందుజాగ్రత్త చర్యగా రైల్వే యంత్రాంగం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రయాణికులు రైళ్లలో బాణసంచా, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్, బొద్దింకల మందు (Cockroach repellent) వంటి సులభంగా మంటలంటుకునే వస్తువులను తీసుకువెళ్లడాన్ని పూర్తిగా నిషేధించారు.

ఈ నిబంధనను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా బాణసంచా, మండే వస్తువులను తరలించే వారిపై రైల్వే చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటారు.

నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 1,000 వరకు జరిమానా.. లేదా ఈ రెండూ కలిపి విధించే అవకాశం ఉందని రైల్వే డివిజన్ హెచ్చరించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *