“దేశాన్ని కుదిపేసిన దారుణ హత్య!” ఆమెకు ఉరిశిక్ష విధించండి. హత్యకు గురైన సౌరభ్ రాజ్‌పుత్ ఇంటిని శుద్ధి చేయడానికి జరిగిన పూజ.. వైరలవుతున్న వీడియో.!!!

మీరట్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్ హత్య కేసులో, దారుణ హత్యకు గురైన సౌరభ్ ఆత్మకు శాంతి చేకూరాలని అఖిల భారత హిందూ మహాసభ జిల్లా అధ్యక్షురాలు మీరా రాథోడ్.. ఘటనా స్థలమైన సౌరభ్ అద్దె ఇంట్లో గంగాజలం చల్లి, ప్రత్యేక పూజలు చేసి శుద్ధి చేశారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితులు ముస్కాన్ మరియు సాహిల్‌లకు వెంటనే ఉరిశిక్ష విధించాలని, వారిని ప్రభుత్వ అతిథుల్లా జైలులో ఉంచడం ఎందుకని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.

ముస్కాన్‌ను ఉరితీయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆ శిక్ష అమలు చేసే సమయంలో సౌరభ్ తల్లి కూడా తోడుగా ఉండి ఉరితాడుకు మరోవైపు తమ ఇద్దరం కలిసి లాగాలని కోరుకుంటున్నట్లు ఆమె భావోద్వేగంగా తెలిపారు.

తన కుమారుడి దారుణ హత్యతో తీవ్ర మనోవేదనకు గురైన సౌరభ్ తల్లి రేణు దేవి, కుమారుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ రోజంతా ఉపవాసం ఉండటమే కాకుండా, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా విచారించి దోషులకు తగిన శిక్ష పడేలా చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు.

అంతేకాకుండా, సౌరభ్ కుమార్తె పిహును ఆమె తల్లి తరపు బంధువులకు ఇవ్వకుండా, ఆమె తాతయ్య, నాయనమ్మలకు అప్పగించాలని, ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న వారందరినీ చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కన్నీళ్లతో డిమాండ్ చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *