“నా తమ్ముడి మీద చెయ్యేయడానికి మీరెవరు..?” అని నిలదీయడానికి వెళ్లిన అక్క ప్రాణాలు తీసిన కిరాతక ముఠా.. తుపాకీతో కాల్చి చంపిన దారుణం.. తమ్ముడి కోసం గొడవకు వెళ్లి బలైన అక్క.. ఆగ్రహంతో ఇంటిని ధ్వంసం చేసిన బంధువులు.. భయానక ఘటన..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో, తన తమ్ముడిపై జరిగిన దాడిని నిలదీసేందుకు వెళ్లిన ఓ మహిళను తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఘజియాబాద్ లోనీ (Loni) బోర్డర్ ఇందిరాపురి కాలనీకి చెందిన పూజ (35), భాయ్ దూజ్ పండుగ జరుపుకోవడానికి తన పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో, గత శనివారం రాత్రి పూజ తమ్ముడు అమన్ ఇంటి దగ్గర నిలబడి ఉన్నప్పుడు, ఆ ప్రాంతానికి చెందిన కొందరు యువకులతో అతనికి గొడవ జరిగింది. ఆ యువకులు అమన్‌పై దాడి చేసి గాయపరిచారు.

తమ్ముడిపై దాడి జరిగిందని తెలుసుకున్న పూజ, వెంటనే ఆ యువకుల ఇంటికి వెళ్లి నిలదీసింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

వాగ్వాదం తారాస్థాయికి చేరుకోవడంతో, ఆగ్రహానికి గురైన అవతలి వర్గం వారు పూజ తలపైనే తుపాకీతో కాల్చారు. తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో కుప్పకూలిన ఆమెను బంధువులు వెంటనే ఢిల్లీలోని జీటీబీ (GTB) ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ హత్యతో ఆగ్రహోదగ్రులైన పూజ కుటుంబ సభ్యులు, స్థానికులు దాడికి పాల్పడిన వారి ఇంటిని బద్దలుకొట్టి ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకుని వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పాటు, కొందరిని అదుపులోకి తీసుకుని ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *