చెన్నై పెరవళ్లూరు వెట్రి నగర్ ప్రాంతానికి చెందిన కూలీ కార్మికుడు రాజేంద్రన్ (68), కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో కాలు విరగడంతో మంచానికే పరిమితమై ఇంట్లోనే చికిత్స పొందుతున్నాడు.
ఆయన కుమారుడు నటరాజన్ (45) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. నటరాజన్ భార్య ఎళిల తన పిల్లలతో కలిసి వేళాంగిణి యాత్రకు వెళ్లి నిన్ననే ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న నటరాజన్‌ను చూసి.. మంచంపైనే మలమూత్రాలు చేసుకుని ఉన్న మామగారిని పట్టించుకోకపోవడంపై ఎళిల అతడిని మందలించి నిద్రపోవడానికి వెళ్లింది.
భార్య తిట్టడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నటరాజన్, తండ్రి బతికి ఉండటం వల్లే ఇంట్లో గొడవలు వస్తున్నాయని భావించి.. వంటింట్లో ఉన్న కత్తిని తెచ్చి మంచంపై పడుకుని ఉన్న తండ్రి రాజేంద్రన్ ఛాతీపై విచక్షణారహితంగా పొడిచాడు. కేకలు విని పరుగులు తీసిన కుటుంబ సభ్యులు తీవ్ర రక్తస్రావంతో ఉన్న వృద్ధుడిని పెరియార్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దారుణ ఘటనపై తిరు.వి.క నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, కన్నతండ్రినే హతమార్చిన నటరాజన్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Leave a Reply