నడుస్తున్న రైల్లో నిద్రిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలి ముఖంపై ఒక వ్యక్తి కావాలనే మూత్రం చల్లిన అసహ్యకరమైన సంఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
అసలేం జరిగిందంటే..?
రైలు ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న సమయంలో, కిటికీ పక్కన కూర్చున్న ఒక వ్యక్తి అత్యంత అనాగరికంగా ప్రవర్తించాడు. అతను సీట్లోనే మూత్ర విసర్జన చేయడమే కాకుండా.. పక్క సీట్లో ప్రశాంతంగా నిద్రిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలి ముఖంపై కావాలనే ఆ మూత్రాన్ని చల్లాడు.
దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురై నిద్రలేచిన సదరు మహిళ మరియు రైల్లోని ఇతర ప్రయాణికులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులందరూ ఆ వ్యక్తిని చుట్టుముట్టి ఎందుకు ఇలా చేశావంటూ సరమారిగా ప్రశ్నలు కురిపిస్తూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. అక్కడ ఉన్న కొందరు ప్రయాణికులు ఈ అసహ్యకరమైన ఉదంతాన్ని అలాగే తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేశారు.
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. నిందితుడు అరెస్ట్
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు సదరు వ్యక్తిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
“భూమికి భారంగా మారిన ఇలాంటి నరమృగాలను నడిరోడ్డుపై నిలబెట్టి కఠినంగా శిక్షించాలి” అంటూ నెటిజన్లు ఇంటర్నెట్‌లో తమ కడుపు మంటను వెళ్లగక్కుతున్నారు.
ఈ వ్యవహారం తీవ్ర రూపం దాల్చడంతో తక్షణమే స్పందించిన రైల్వే పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి సదరు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశారు.

Leave a Reply