“నీకు వేరే మార్గమే లేదు!”: ఒంటరిగా వెళ్తున్న మహిళా కానిస్టేబుల్.. కారుతో వెంబడించిన యువకుడు.. ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లే దారిలో షాకింగ్ ఘటన.!!

నమక్కల్ జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ తేన్‌మొళి ప్రస్తుతం పొదటూరుపేట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు.

ఆమె గతంలో పళ్లిపట్టులో పనిచేసిన సమయంలో, అక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న తిరుత్తణికి చెందిన రామ్‌కుమార్ అనే వ్యక్తి ఆమెను వన్‌సైడ్ లవ్ చేశాడు. తేన్‌మొళి తన వ్యతిరేకతను స్పష్టంగా తేల్చిచెప్పినప్పటికీ.. రామ్‌కుమార్ దానిని లెక్కచేయకుండా ఫోన్ ద్వారా, ఇతర మార్గాల్లో ఆమెను నిరంతరం వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు.

ఈ క్రమంలో ఇటీవల జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు తేన్‌మొళి తన ద్విచక్రవాహనం (స్కూటీ)పై ఒంటరిగా వెళ్తున్నారు. ఆ సమయంలో ఆమెను కారులో వెంబడించిన రామ్‌కుమార్, నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను అడ్డగించి తన ప్రేమను అంగీకరించాలంటూ మరోసారి బలవంతం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న తేన్‌మొళి, జిల్లా ఎస్పీ సాయి ప్రణీత్‌ను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రామ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ మరణించిన తన తండ్రి స్థానంలో కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందిన వ్యక్తే.. ఒక మహిళా కానిస్టేబుల్‌ను వేధించి అరెస్ట్ కావడం తోటి పోలీసు వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *