పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్పూర్ ప్రాంతంలో జరిగిన ఓ వివాహంలో, నిశ్చయమైన వరుడితో వధువు కొన్ని నెలలుగా ఫోన్లో రోజూ మాట్లాడుతూ ప్రేమగా గడిపింది.
పెళ్లి రోజున వరుడి తరఫు బంధువులు అత్యంత వైభవంగా బాజాభజంత్రీలతో ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేరుకున్నారు. తీరా పెళ్లి పీటలపై ఆచారాలు, శాస్త్రాలు జరుగుతున్న సమయంలో వధువు వరుడి ముఖాన్ని తేరిపార చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. తాను ఫోన్లో చూసి మాట్లాడిన వ్యక్తి, పెళ్లి పీటలపై కూర్చున్న వ్యక్తి ఇద్దరూ వేర్వేరు అని భావించి, పూజలను మధ్యలోనే ఆపేసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది.
విచారించగా, వరుడు తనకు ఫొటోలు పంపించేటప్పుడు మితిమీరిన ‘బ్యూటీ ఫిల్టర్లు’ వాడి పంపించినట్లు తేలింది. “ఇది నా జీవితానికి సంబంధించిన సమస్య.. ఫొటోలో కనిపించినట్లు కాకుండా నేరుగా పూర్తిగా భిన్నంగా ఉన్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోలేను” అని వధువు కరాఖండిగా తేల్చి చెప్పడంతో వివాహం రద్దయింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు.

Leave a Reply