ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ముంగేలి జిల్లాలో, పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఓ మహిళపై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఆదివారం మధ్యాహ్నం, పాండర్భాతా ప్రధాన రహదారి గుండా పాండర్భాతా గ్రామానికి చెందిన గీతా బాయి (46) అనే మహిళ, తన తలపై బిందెను మోస్తూ పొలం పనుల నుంచి ఇంటికి తిరిగి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో ఊహించని రీతిలో ఆమెపై నేరుగా పిడుగు విరుచుకుపడింది.
వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను రక్షించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన లైవ్ వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వర్షం, ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ఎవరూ ఆరుబయట లేదా బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని నిపుణులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply