పాత ల్యాప్‌టాప్‌ను అమ్మాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి.. మీ బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత ఫొటోలు ఇతరుల చేతికి వెళ్లొచ్చు! అమ్మే ముందు తప్పక చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు!

పాత ల్యాప్‌టాప్‌ను అమ్మే ముందు అందులోని ముఖ్యమైన ఫైళ్లను సురక్షితంగా మరో చోట సేవ్ చేసుకోవాలి.

ఫొటోలు, వీడియోలు, ఆఫీస్ డాక్యుమెంట్లు తదితర వాటిని గూగుల్ డ్రైవ్ వంటి క్లౌడ్ స్టోరేజ్ లేదా ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్, పెన్ డ్రైవ్‌లో బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ సరిగ్గా సేవ్ అయిందో లేదో ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవడం కూడా చాలా అవసరం.

ల్యాప్‌టాప్‌లో ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు అనేక వెబ్‌సైట్ల పాస్‌వర్డ్‌లను బ్రౌజర్‌లో సేవ్ చేసి ఉంచుతాం. ముఖ్యంగా ఇమెయిల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి ఖాతాల వివరాలు ఇతరులకు తెలియకుండా ఉండాలంటే బ్రౌజర్ హిస్టరీ, కుకీస్, సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను తొలగించాలి. అలాగే గూగుల్, ఇమెయిల్ తదితర ముఖ్యమైన ఖాతాల నుంచి లాగ్ అవుట్ అవ్వాలి.

ఆ తర్వాత, ల్యాప్‌టాప్‌లో ఉన్న అన్ని ఫైళ్లను ఒకసారి పరిశీలించాలి. ‘This PC’ లేదా ‘My Computer’ లోకి వెళ్లి ప్రతి డ్రైవ్‌ను ఓపెన్ చేసి చూడాలి. ముఖ్యంగా డౌన్‌లోడ్స్, డాక్యుమెంట్స్, డెస్క్‌టాప్ వంటి ఫోల్డర్లలో ఏవైనా ముఖ్యమైన ఫైళ్లు మిగిలిపోయాయా అని తనిఖీ చేసుకోవాలి. ఫొటోలు ఎక్కడ సేవ్ చేశారో గుర్తులేకపోతే, ఫైల్ ఎక్స్‌ప్లోరర్ (File Explorer) సెర్చ్ బాక్స్‌లో JPG, PNG వంటి ఫైల్ ఫార్మాట్లను టైప్ చేసి వెతకవచ్చు.

చివరగా, అవసరమైన అన్ని ఫైళ్లను బ్యాకప్ తీసుకున్న తర్వాత ల్యాప్‌టాప్‌ను ఫ్యాక్టరీ రీసెట్ (Factory Reset) చేయాలి. విండోస్ ల్యాప్‌టాప్‌లో ‘Remove Everything’ ఆప్షన్‌ను ఎంచుకుని, అందుబాటులో ఉంటే ‘Clean Data’ ఆప్షన్‌ను కూడా ఉపయోగించాలి. ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లలోనూ డేటాను సురక్షితంగా తొలగించే ఆప్షన్‌ను ఎంచుకోవడం మంచిది. సాధారణ రీసెట్ మాత్రమే అన్ని సందర్భాల్లో డేటాను పూర్తిగా తొలగిస్తుందనే గ్యారెంటీ లేదు కాబట్టి, సురక్షితమైన పద్ధతిలో డేటాను తొలగించిన తర్వాతే ల్యాప్‌టాప్‌ను విక్రయించాలి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *