“పెట్రోల్ బంకులో ఘోర ప్రమాదం”.. సీఎన్‌జీ గ్యాస్ నింపుతుండగా భారీ శబ్దంతో పేలిపోయిన ఫ్యూయెల్ పైప్.. విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగి.. గుండెల్ని పిండేసే వీడియో!

జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్ పరిధిలోని ఒక పెట్రోల్ బంకులో, వాహనానికి సీఎన్‌జీ (CNG) ఇంధనం నింపుతుండగా చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో 24 ఏళ్ల ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.

జంషెడ్‌పూర్ జిల్లాలోని ఆర్‌.కె. జైన్ భారత్ పెట్రోలియం బంకులో తుషార్ కమ్రి (24) అనే యువకుడు సిబ్బందిగా పనిచేస్తున్నాడు. ఆగస్టు 27 రాత్రి సుమారు 10:40 గంటల సమయంలో, బంకుకు వచ్చిన ఒక వాహనంలో అతను సీఎన్‌జీ గ్యాస్ నింపుతున్నాడు.

ఆ సమయంలో ఊహించని విధంగా సీఎన్‌జీ ఫిల్లింగ్ పైప్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. గ్యాస్ ఉధృతంగా లీక్ కావడంతో పెట్రోల్ బంకులో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో అర్థంకాక భయపడిపోయిన కస్టమర్లు, ప్రజలు తమ వాహనాలను అక్కడే వదిలేసి పరుగులు తీశారు.

ఈ ప్రమాద తీవ్రతకు పేలిపోయిన సీఎన్‌జీ పైపు మెటల్ నాజిల్ ఎగిరివచ్చి తుషార్ కమ్రి తలకు బలంగా తాకింది. దీంతో అతడు తీవ్ర రక్తస్రావంతో కిందపడిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతడిని తోటి ఉద్యోగులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తుషార్ కమ్రి ప్రాణాలు కోల్పోయాడు.

పెట్రోల్ బంకులోని సీసీటీవీ కెమెరాల్లో ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. పైపు పేలి గ్యాస్ లీక్ అవ్వడం, జనం భయంతో పరుగులు తీయడం అందులో కనిపించాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీఎన్‌జీ పైపు పేలడానికి గల అసలు కారణమేంటి? బంకు యాజమాన్యం భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిందా? లేక నిర్లక్ష్యమే కారణమా? అనే కోణాల్లో అధికారులు ముమ్మర విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *