బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ పెళ్లయిన రెండేళ్లకు తల్లి అయింది. అయితే, ఆమె భర్త ఆ బిడ్డకు తన పేరు పెట్టడానికి నిరాకరించడమే కాకుండా, భార్య శీలాన్ని శంకిస్తూ పలు ఆరోపణలు చేశాడు. ఆ బిడ్డ తనది కాదని, ఆమె ప్రవర్తన మంచిది కాదని వాదిస్తున్నాడు.
భర్త వాదన ప్రకారం.. పెళ్లయిన తర్వాత వారు అసలు శోభనం (ఫస్ట్‌నైట్) జరుపుకోలేదు. అలాంటప్పుడు బిడ్డ ఎలా పుడుతుందని అతను ప్రశ్నిస్తున్నాడు. అయితే భార్య ఈ ఆరోపణలన్నింటినీ పూర్తిగా ఖండించింది. ఈ మొత్తం వ్యవహారం ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో చోటుచేసుకుంది.
కట్నం కోసమే ఈ నాటకాలు: బాధితురాలి ఆవేదన
బాధితురాలైన యువతి ఈ విషయంపై స్పందిస్తూ.. తనను అప్రతిష్ఠ పాలు చేయడానికి, సమాజంలో చెడ్డదాన్ని చేయడానికి భర్త ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి సమయంలో కట్నం తక్కువ ఇచ్చామనే నెపంతో మొదటి నుంచే అత్తగారింటి వారు తనను వేధించేవారని, ఇప్పుడు పుట్టిన బిడ్డను కూడా అంగీకరించకుండా తప్పుకుంటున్నారని తెలిపింది. భర్త మానసిక, శారీరక వేధింపులు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేసింది.
అత్తగారు జోక్యం చేసుకుంటేనే శోభనం జరిగింది!
ప్రేమ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఈ యువతికి, ఇజ్జత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో వివాహం జరిగింది. బాధితురాలి ఆరోపణల ప్రకారం:
పెళ్లయిన మొదటి రెండు రోజులు భర్త ఆమెతో శోభనానికి నిరాకరించాడు. అదే సమయంలో అత్తగారింటి వారు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు.
ఈ విషయాన్ని ఆమె తన అత్తగారికి చెప్పడంతో, అత్తగారి జోక్యంతో రెండు రోజుల తర్వాత వారు శోభనం జరుపుకున్నారు.
ఆస్తి నుండి బహిష్కరణ – అద్దె ఇంట్లో వేధింపులు:
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల భర్తను అతని కుటుంబ సభ్యులు ఆస్తి నుంచి బహిష్కరించారు. దీంతో అతను భార్యతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉండటం ప్రారంభించాడు. అక్కడికి రోజూ మద్యం తాగి వచ్చి ఆమెను దారుణంగా కొట్టేవాడు. పుట్టింటి నుండి అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవాడు. తీరా ఆమె గర్భం దాల్చి తల్లి కాగానే.. తప్పించుకోవడానికి ఆమె క్యారెక్టర్‌పై బురదజల్లడం ప్రారంభించాడు.
అద్దె ఇంట్లోనే వదిలేసి పరార్
ఒకరోజు నిందితుడు ఆమెను అద్దె ఇంట్లోనే వదిలేసి అకస్మాత్తుగా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. బాధితురాలు మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని చూసినా, అత్తగారింటి వారు తమ మొండివైఖరి వీడలేదు సదా ఆమె శీలాన్ని తప్పుబడుతూనే ఉన్నారు. విసిగిపోయిన బాధితురాలు చివరకు ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో భర్త, అత్తగారింటి వారిపై గృహహింస, కట్నం వేధింపుల కింద కేసు నమోదు చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply