ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో 22 ఏళ్ల వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ప్రహ్లాద్పూర్ బంగర్ గ్రామంలోని ఒక ఇంటి బాత్రూమ్లో సబీలా ఖాతూన్ అనే వివాహిత శవమై కనిపించింది. ఆగస్టు 29న ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. బాధితురాలి సోదరుడే మొదట ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిసింది.
సబీలా ఖాతూన్‌కు సుమారు రెండేళ్ల క్రితం మహమ్మద్ లాల్‌బాబు అనే వ్యక్తితో వివాహం జరిగినట్లు ఆమె సోదరుడు పోలీసులకు వెల్లడించాడు. ఘటన జరిగిన రోజున చెల్లెలిని చూసేందుకు ఆమె ఇంటికి వెళ్లిన మహమ్మద్ గులాబ్.. బాత్రూమ్లో సబీలా విగతజీవిగా పడి ఉండటం చూసి హతాశుడయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు.
సబీలా ఇంట్లో శవమై పడి ఉన్న సమయంలో ఆమె భర్త మహమ్మద్ లాల్‌బాబు, వారి చిన్నారి ఇద్దరూ కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని భావిస్తున్నారు.
ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో హత్య సహా పలు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న భర్త మహమ్మద్ లాల్‌బాబు కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వివాహిత మృతి వెనుక ఉన్న అసలు కారణాలు, భర్త తన బిడ్డతో కలిసి పరారవ్వడం వెనుక ఉన్న నేపథ్యంపై పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply