“పెళ్లి చేసుకోమని అడగడమే తప్పా..?” 8 నెలల గర్భిణి అయిన ప్రియురాలిని తీసుకెళ్లి కిరాతక హత్య.. అడవిలో బయటపడ్డ షాకింగ్ నిజం.. కలచివేసే దారుణం..!!

జార్ఖండ్‌లో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే అత్యంత పాశవిక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకోవాలని నిలదీసినందుకు, 8 నెలల గర్భిణిగా ఉన్న ప్రియురాలిని ఆమె ప్రియుడే అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యంత క్రూరంగా హత్య చేశాడు.

ఖుంటి జిల్లా ముర్హు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంగురా గ్రామానికి చెందిన సాగర్ ఓడెయా, మృతురాలు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అయితే సాగర్ వేరొక యువతిని తన ఇంటికి తీసుకురావడంతో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.

గత సెప్టెంబర్ 2వ తేదీన పుట్టబోయే బిడ్డకు న్యాయం చేయాలని, తనను పెళ్లి చేసుకోవాలని అడిగేందుకు ఆ యువతి సాగర్ ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత సెప్టెంబర్ 4 నుంచి ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు ఆమె కోసం గాలిస్తుండగా, ఆదివారం సమీప అటవీ ప్రాంతంలో ఆమె శవమై తేలింది.

నిందితుడు సాగర్ ఆ యువతికి మాయమాటలు చెప్పి నమ్మించి, అడవిలోకి తీసుకెళ్లి దారుణంగా అంతమొందించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. శవపరీక్షలో ఆమె కడుపులోని 8 నెలల పిండం కూడా మరణించినట్లు వెల్లడైంది.

దీంతో పోలీసులు జంట హత్యల కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడైన సాగర్ ఓడెయాను అరెస్ట్ చేశారు. ఈ కిరాతక హత్యలో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *