“పోలీస్ స్టేషన్ గుమ్మంలోనే ఇంత ధైర్యమా..?” మనవరాళ్లను చూడనివ్వలేదన్న ఆగ్రహం.. భార్యను కొడవలితో నరికిన భర్త.. తప్పించుకుని పారిపోతూ కిందపడినా వెంబడించి మరీ నరికిన దారుణం.. తీవ్ర కలకలం రేపిన ఘటన..!!

కేరళ రాష్ట్రం మరయూర్ ప్రాంతంలో కుటుంబ కలహాల కారణంగా పోలీస్ స్టేషన్ గుమ్మంలోనే భార్యను భర్త కొడవలితో నరికిన ఘటన తీవ్ర కలకలాన్ని, దిగ్భ్రాంతిని రేపింది.

కాంతలూర్ తీర్థమలై ప్రాంతానికి చెందిన సుబ్బులక్ష్మి, మాంకుళంకు చెందిన శివానందన్ మనస్పర్థల కారణంగా విడివిడిగా జీవిస్తున్నారు. వీరికి 12, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

తన తండ్రికి మనవరాళ్లను చూపించేందుకు అనుమతించాలని శివానందన్ కోరగా సుబ్బులక్ష్మి నిరాకరించింది. దీనిపై ఫిర్యాదు అందడంతో, ఇద్దరినీ మరయూర్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చర్చలు జరిపారు.

చర్చల్లో రాజీ పడేందుకు సుబ్బులక్ష్మి అంగీకరించకపోవడంతో, ఇద్దరికీ సర్దిచెప్పి శాంతియుతంగా వెళ్లాలని పోలీసులు పంపించేశారు. కానీ, పోలీస్ స్టేషన్ గుమ్మం దాటగానే ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శివానందన్, తన వెంట తెచ్చుకుని దాచిపెట్టుకున్న కొడవలితో సుబ్బులక్ష్మిని దారుణంగా నరికాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుబ్బులక్ష్మి ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతుండగా, మరయూర్ పోలీసులు శివానందన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *