ఫ్లాష్: ప్రపంచాన్ని కుదిపేసిన దారుణం..! “యేసుక్రీస్తును చూడాలా?”. 190 మంది పిల్లలను ఆకలితో మాడ్చి దారుణంగా చంపిన మత ప్రబోధకుడు. 200 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు తీర్పు..!!

యేసుక్రీస్తును ప్రత్యక్షంగా కలవాలంటే ఆకలితో మాడి ప్రాణాలు విడవాలని మాయమాటలు చెప్పి, పిల్లలు సహా 191 మందిని దారుణంగా పొట్టనబెట్టుకున్న కెన్యాకు చెందిన మత ప్రబోధకుడు పాల్ మెకెంజీ (Paul Mackenzie) కి ఆ దేశ న్యాయస్థానం 200 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

కెన్యాలోని మొంబాసా (Mombasa) హైకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ‘గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చి’ అనే సంస్థను నడుపుతున్న పాల్ మెకెంజీ.. త్వరలో యుగాంతం రాబోతోందని, అంతకంటే ముందే స్వర్గానికి వెళ్లి యేసుక్రీస్తును చేరుకునేందుకు తమతో పాటు తమ పిల్లలను కూడా ఆకలితో మాడ్చి ప్రాణాలు తీసుకునేలా తన అనుచరులకు బోధించాడు. 190 మంది పిల్లలు, ఒక పెద్దవారితో కలిపి మొత్తం 191 మంది మరణానికి ఇతనే ప్రత్యక్ష కారణమని న్యాయస్థానం నిర్ధారించింది.

ఈ దారుణ కాండలో అతనికి సహకరించిన 28 మంది అనుచరులకు కూడా ఈ నేరంలో ప్రమేయం ఉన్నట్లు రుజువైంది. ఆకలి దీక్షను బలవంతంగా అమలు చేసిన కాపలాదారులు, మరణించిన వారి మృతదేహాలను రహస్యంగా పూడ్చిపెట్టేందుకు గోతులు తవ్విన వారు కూడా ఇందులో ఉన్నారు. విచారణలో ఒకరు మాత్రమే తన నేరాన్ని అంగీకరించగా, మెకెంజీతో సహా మిగతా వారంతా ఆరోపణలను ఖండించారు. అయినప్పటికీ, సాక్ష్యాధారాలన్నింటి ఆధారంగా మొత్తం 29 మందినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది.

గతంలో, 2023లో కెన్యాలోని కిలిఫి (Kilifi) కౌంటీలో ఉన్న శకాహోలా (Shakahola) అటవీ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడిన 400లకు పైగా మృతదేహాలు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. 2017 నుంచే పోలీసుల నిఘాలో ఉన్నప్పటికీ మెకెంజీ నిరాటంకంగా ఇలాంటి దారుణాలకు ఎలా పాల్పడ్డాడనే దానిపై కెన్యాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు, తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *